Sunday, December 29, 2024

పిన్నెలిపై ఫేక్ వీడియో… టిడిపితో పోలీసులు, అధికారులు కుమ్మక్కు: అంబటి రాంబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో జరిగిన ఘర్షణలు సంచలనం సృష్టించాయి. పోలింగ్ జరిగిన మూడు రోజుల వరకు కూడా ఘర్షణలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఎపి పోలీసులపై ఇసి ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇవిఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో మాచర్ల పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వైసిపి, టిడిపిలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వీడియోలు విడుదల చేయడంతో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు చేసుకున్నారు.

ఎంఎల్ఎ పిన్నెలి రామకృష్ణారెడ్డిపై పేక్ వీడియో తయారు చేసి ట్విట్టర్ లో టిడిపి నేత నారా లోకేష్ విడులు చేశారని, అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాుబు తన ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. వైరల్ అవుతున్న మాచర్ల ఎంఎల్ఎ రామకృష్ణారెడ్డి వీడియోకు ఎన్నికల కమిషన్ కు సంబంధం లేదని ప్రకటించడం విడ్డూరమన్నారు. ఈ ఫేక్ వీడియోతోనే పోలీసులు, అధికారులు తెలుగు దేశంతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News