Thursday, September 19, 2024

నకిలీ వీసా రాకెట్ గుట్టురట్టు.. ఐదేళ్లలో రూ.300 కోట్లు

- Advertisement -
- Advertisement -

నకిలీ వీసాతో దేశం దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి అధికారుల చేతికి చిక్కడంతో ఈ రాకెట్టు గుట్టు రట్టయింది. ఐదేళ్లలో నకిలీ వీసాల విక్రయంతో రూ. కోట్లకు పైగా కొల్లగొట్టినట్టు విచారణలో తేలింది. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం … ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇటీవల ఓ వ్యక్తి నకిలీ వీసాతో ఇటలీ వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇమ్మిగ్రేషన్ చెకింగ్ దగ్గర అతడి బండారం బయటపడింది. వెంటనే అతడిని అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. దీంతో రూ. వందల కోట్ల కుంభకోణం బయటపడింది. ఓ ఏజెంట్‌కు రూ.10 లక్షలు ఇచ్చి తాను నకిలీ వీసా పొందినట్టు నిందితుడు చెప్పాడు. అంతేకాకుండా తమ గ్రామం లోని చాలా మంది ఇలాగే విదేశాలకు వెళ్లారని వెల్లడించాడు. దీంతో పోలీస్‌లు దర్యాప్తు చేపట్టి ఏజెంట్ ఆసిఫ్ అలీతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

వారిని విచారించగా కీలక విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఢిల్లీ లోని తిలక్‌నగర్‌లో ఒక వ్యక్తికి చెందిన కర్మాగారంలో నకిలీ వీసాలను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఆ కేటుగాళ్లు ప్రతినెలా 20 నుంచి 30 వీసాలు తయారు చేస్తున్నారు. ఒక్కో వీసాకు రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసేవారని, ఇలా గత పదేళ్లలో 5 వేల నకిలీ వీసాలను విక్రయించి రూ. 300 కోట్లకు పైగా ఆర్జించినట్టు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని పోలీస్‌లు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 16 నేపాల్ పాస్‌పోర్టులతోపాటు రెండు భారత్ పాస్‌పోర్టులు , 30 వీసా స్టిక్కర్లు, 23 వీసా స్టాంప్‌లు, వీసా తయారీ మెషిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్‌ను నడిపేందుకు విదేశాల్లో ఏజెంట్లను కూడా నియమించుకోవడం గమనార్హం. వీరితో వాట్సాప్, టెలిగ్రామ్‌లలో టచ్‌లో ఉన్నట్టు తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News