Friday, November 22, 2024

తిమింగలం వాంతి పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -
fake whale vomit racket busted in hyderabad
ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన సైఫాబాద్ పోలీసులు

హైదరాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠాను సైఫాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…సుగంధ ద్రవ్యాల్లో వాడు అండర్‌గ్రిస్(తిమింగలం వాంతి) పదార్థం తమ వద్ద ఉందని నకిలీ పదార్థాన్ని విక్రయించేందుకు ముఠా ప్రయత్నించింది. షకీర్ అలీ, షేక్ అలీ, మహమ్మద్ ఆరిఫ్, మహ్మద్ నజీర్, మోహన్‌లాల్‌యాదవ్, మహ్మద్ అజారుద్దిన్, మహ్మద్ హుస్సానుద్దిన్ కలిసి తిమింగళం వాంతి పేరు చెప్పి విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని ఎస్‌బిఐ వీధిలో గదిని అద్దెకు తీసుకుని కార్యాలయం ఏర్పాటు చేశారు. పలువురికి తిమింగళం వాంతి పేరు చెప్పి ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్ లాంటి పదార్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

fake whale vomit racket busted in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News