మెండోరా : రాజకీయ లబ్ధి కోసమే మంత్రి ప్రశాంత్‌రెడ్డి పై కాంగ్రెస్, బిజెపి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధ్ది పొందాలన్న ఉద్దేశంతోనే మంత్రి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, బాల్కొండ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. నియోజక వర్గంలో సెంట్రల్ లైటింగ్, వంతెన నిర్మాణ పనులు చేసింది వేరే కాంట్రాక్టర్‌లు అని అన్నారు.
కానీ బిజెపి నాయకులు అన్ని అభివృద్ధి పనులకు ఒకే కాంట్రాక్టర్‌కి ఇస్తున్నారని చెబుతూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కమీషన్లు తీసుకోవాల్సిన అవసరం మంత్రికి లేదన్నారు. అభివృద్ధిని జీర్ణించుకోలేక కాంగ్రెస్, బిజెపి నాయకులు చౌకబారు ఆరోపణలు మానుకోకుంటే ప్రజలే తగిన గు ణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పిటిసి తలారి గంగాధర్, సొసైటీ చైర్మన్ మచ్చర్ల రాజారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సాయారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సామ గంగారెడ్డి, స్థానిక పార్టీ నాయకులు నవీన్ గౌడ్, దుద్గాం ఎంపిటిసి ఒడ్డం, దేవేందర్, సావెల్ ఎంపిటిసి మిట్టపల్లి వెంకట్‌రెడ్డి, గోపాల్, బురుకల కమలాకర్, అలుగుల శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.