- Advertisement -
కరీంనగర్: దళితబంధు పథకంపై తప్పుడు వార్తలు రాయడం సరికాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా కొప్పుల మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకం దేశానికి దిక్సూచిగా నిలవడం సిఎం కెసిఆర్ సంకల్పమని ప్రశంసించారు. తెలంగాణ వ్యాప్తంగా 11835 యూనిట్లలో 11500 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేశామని, మరో 335 యూనిట్లు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 2వ విడత దళితబంధు కోసం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించామన్నారు. నియోజకవర్గానికి 1500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నడుస్తోందన్నారు. త్వరలో వాటిని కూడా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. తెలంగాణలో నూటికి నూరుశాతం దళితబంధు పథకం అమలు చేస్తామన్నారు. సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతుబంధు, రైతు బీమా, 20 గంటల కరెంట్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు.
- Advertisement -