Saturday, December 21, 2024

కమిషనర్‌పై కావాలనే తప్పుడు ప్రచారం

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్: మున్సిపల్ చట్టంకు లోబడి పాలనను అందిస్తున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను నిందించడం తగదని నగర బిఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు చింతల నర్సింహారెడ్డి అన్నారు. గురువారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నర్సింహారెడ్డి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా పరిపాలన పక్కకు పెట్టి ప్రజాప్రతినిధుల మాటలను శిరసావహించి అవినీతిమయంగా మారిన పాలనను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ వ్యవహార శైలి కొందరు నాయకులకు మింగుడు పడకపోవడం బాధాకరమని అన్నారు.

కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ కమలానగర్‌లో ప్రజల అవస్థలను గుర్తించి కబ్జాకు గురి అవుతున్న రోడ్డును పరిరక్షించాలనె ధ్యేయంతో కమిషనర్ పనిచేస్తుంటె ఇది మింగుడు పడని కొందరు నా యకులు ప్రజా సంక్షేమాన్ని పక్కకు నెట్టి వారి సంక్షేమం కోసం ఆలోచిస్తూ ప్రజల్లో తీర గందరగోళాన్ని రేకెత్తిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదనన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న మున్సిపల్ కమిషనర్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News