Friday, December 20, 2024

దరఖాస్తు చేసుకోకపోయినా గ్రూప్ -1 హాల్ టికెట్ జారీ చేశారని జరుగుతున్న ప్రచారం అబద్దం

- Advertisement -
- Advertisement -
టిఎస్‌పిఎస్‌సి వివరణ

హైదరాబాద్ : గ్రూప్- 1 పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా ఓ అభ్యర్థికి హాల్ టికెట్ జారీ చేశారని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారమని కమిషన్ స్పష్టం చేసింది. నిజామాబాద్ అభ్యర్థి జక్కుల సుచరిత గతేడాది గ్రూప్ -1 పరీక్షకు దరఖాస్తు చేశారని, అక్టోబర్‌లో జరిగిన పరీక్షకు ఆమె హాజరయ్యారని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. ఈ క్రమంలోనే గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షల కోసం దరఖాస్తు చేస్తే గ్రూప్-1 ప్రిలిమినరీ హాల్ టికెట్ ఇచ్చారన్న ప్రచారం అబద్ధమని టిఎస్‌పిఎస్‌సి కొట్టి పారేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 2,33,248 (61.37 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతేడాది పరీక్ష జరిగి రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 2.86 మంది(79.15 శాతం) హాజరుకాగా, రెండోసారి నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 53 వేల మంది గైర్హాజరు కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News