Monday, December 23, 2024

ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ ఇష్టపడే సినిమా ‘గం..గం..గణేశా‘

- Advertisement -
- Advertisement -

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గం..గం..గణేశా‘. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘గం..గం..గణేశా‘ ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. నేషనల్ క్రష్ రశ్మిక మందన్న అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్న మాట్లాడుతూ – “ఈ సినిమా సక్సెస్ అందుకుంటే ఆనంద్ మొహంలో నవ్వు ఉంటుంది. ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నా.

‘గం..గం..గణేశా‘ సాంగ్స్ కు నేను డ్యాన్సులు చేశా. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ ఉదయ్‌కు ఈ సినిమా బిగ్ సక్సెస్ ఇవ్వాలి”అని అన్నారు. హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – “నేను ఇప్పటిదాకా ఈ సినిమాలో కనిపించనంత ఎనర్జిటిక్ గా మరే మూవీలో కనిపించలేదు. నాలో ఆ ఎనర్జీని డైరెక్టర్ ఉదయ్ చూపించాడు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ వందమందికి ఈ సినిమా చూపించాం. వాళ్లంతా మూవీలో వచ్చే ట్విస్ట్, టర్న్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమ్మర్‌కు పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘గం..గం..గణేశా”అని తెలిపారు.

డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ “గం..గం..గణేశా కామెడీ మూవీ అనుకుంటే థ్రిల్ చేస్తుంది, థ్రిల్లర్ అనుకుంటే నవ్విస్తుంది, రెగ్యులర్ యాక్షన్ కామెడీ అనుకుంటే సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉంది. ఆ రోల్ థియేటర్‌లో చూసి షాక్ అయ్యేందుకు రెడీగా ఉండండి. ‘గం..గం..గణేశా‘ ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ అందరూ ఇష్టపడే సినిమా అవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ, బన్నీ వాస్, ఎస్‌కేఎన్, సాయి రాజేశ్, ఆస్ట్రలాజర్ ఆర్‌ఎంపీ శెట్టి, అనుదీప్ కె.వి, మధుర శ్రీధర్ రెడ్డి, వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి, సత్యం రాజేష్, అనురాగ్ పర్వతనేని, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News