- Advertisement -
చెన్నై: తమిళనాడు రాష్ట్రం మధురైలోని ఎంజిఆర్ కాలనీలో కరోనా వైరస్ తో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ కుటుంబంలోని తల్లి జ్యోతికకు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆమెకు కరోనా వచ్చిందని తెలియగానే విషం తాగి ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆ నలుగురిని రాజాజీ ఆస్పత్రికి తరిలించారు. జ్యోతిక, రితిష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. జ్యోతిక తల్లి లక్ష్మి, ఆమె సోదరుడు సిబిరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత సంవత్సరం లక్ష్మి భర్త, కూతురు అనిత చనిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా మానసికంగా కుంగిపోయింది.
- Advertisement -