Thursday, January 9, 2025

కర్నాటక అసెంబ్లీ ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రుణ బకాయిల కోసం తమ ఇంటిని బ్యాంకు వేలం వేసినందుకు మనస్థాపానికి గురైన ఒక కుటుంబానికి చెందిన 8 మంది సభ్యులు బుధవారం బెంగళూరులోని కర్నాటక అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. అసెంబ్లీ ముందు తమ ఒంటిపై కిరోసిన్ పోసుకున్న ఆ కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు ఈడ్చుకుంటూ పోలీసు వాహనాలలో ఎక్కిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బెంగళూరు సిటీ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి 2016లో ఆ కుటుంబం రూ. 50 లక్షల రుణం తీసుకుంది. రూ. 95 లక్షల వరకు ఆ కుటుంబం చెల్లించినప్పటికీ వడ్డీ, ఇతర చెల్లింపులతో కలుపుకుని మరి కొంత బకాయి మిగిలిపోయింది. దీంతో తమ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకు ఆ ఇటిని వేలం వేసింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ కుటుంబ సభ్యులు అందరూ కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News