Saturday, December 21, 2024

అంతుచిక్కని వ్యాధితో కుటుంబం మృత్యువాత

- Advertisement -
- Advertisement -

 

కరీంనగర్ : తెలంగాణలో అంతుచిక్కని వ్యాధి భయాందోళనకు గురి చేస్తుంది. కరీంనగర్ జిల్లాలోని గంగాధరలో అంతుచిక్కని వ్యాధితో 45 రోజుల్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మరణించారు. శ్రీకాంత్, మమత దంపతులకు ఇద్దరు సంతానం. మొదట 20 నెలల కుమారుడు అద్వైత్ ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ నవంబర్ 16న మరణించాడు. ఇదే వ్యాధి లక్షణాలతో ఐదేళ్ల పాప అమూల్య నవంబర్ 29న, డిసెంబర్ 18న శ్రీకాంత్ భార్య మమత మరణించింది. నిన్న శ్రీకాంత్ కూడా ఇదే వ్యాధితో చనిపోయాడు. చనిపోయిన వారి రక్తనమూనాలను అధికారులు హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News