Monday, January 20, 2025

శ్రీలంక పర్యటనలో కుటుంబం దుర్మరణం.. బాధితుడికి రూ.1 కోటి పరిహారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోవడమే కాకుండా, బాధితుడికి సేవలు అందించడంలో నిర్లక్షంగా వ్యవహరించిన ట్రావెల్ కంపెనీలకు ఢిల్లీ వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. బాధితుడికి రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన యోగేశ్ సైగల్ 2019లో కుటుంబంతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ఈమేరకు ఢిల్లీకి చెందిన ట్రావెల్స్ కంపెనీ థామస్‌ కుక్‌కు రూ.3.46 లక్షలు చెల్లించి ప్యాకేజీ కుదుర్చుకున్నారు.

అయితే ట్రావెల్స్ కంపెనీ ముందు చెప్పినదానికి భిన్నంగా శ్రీలంకలో చిన్న వాహనంలో వారిని తిప్పింది. ఈ సమయంలో కొలంబోలో వారు ప్రయాణిస్తున్న వాహనం కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యోగేశ్ సైగల్ భార్య, కుమారుడు, కుమార్తె, మామ ప్రాణాలు కోల్పోయారు. సైగల్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. కోలుకున్న తరువాత అతను 2021లో థామస్ కుక్, రెడ్ యాపిల్ కంపెనీలపై నష్టపరిహారం కోసం వినియోగదారుల కమిషన్‌లో దావా వేశారు. దానిపై విచారించిన కమిషన్ ట్రావెల్స్ కంపెనీలను తప్పు పట్టింది. నిర్లక్షంగా వ్యవహరించి బాధితుడి జీవితాన్ని అంధకారం చేసినందుకు రూ. కోటి చెల్లించాలని ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News