Sunday, April 13, 2025

ఫ్యామిలీ హ్యాపీగా చూసే సినిమా

- Advertisement -
- Advertisement -

టీవీ యాంకర్ టర్న్ హీరో ప్రదీప్ మాచిరాజు నటించిన యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. యంగ్ టాలెంటెండ్ డైరెక్టర్స్ నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మించిన ఈ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటించింది. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాచిరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “సినిమా ప్రారంభం నుంచి చివరి -వరకు మంచి ఎంటర్‌టైనర్ ఇది. ఫ్యామిలీ అంతా కూర్చుని సమ్మర్‌లో హ్యాపీగా చూసే సినిమా. ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని ఒక చందమామ కథల చూడొచ్చు.

అనగనగా ఒక ఊరు. అక్కడ ఓ అమ్మాయి. ఆ ఊరికి వెళ్ళిన ఒక సివిల్ ఇంజనీర్. ఆ ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ రూల్స్ మధ్య హీరో ఎలా ఇరుక్కున్నాడు? అనేది చాలా ఆసక్తికరంగా చూపించడం జరిగింది. ఇందులో కృష్ణ అనే పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో నేను ఎంత చిరాకు పడతానో ఆడియన్స్ అంత ఎంటర్‌టైన్ అవుతారు. ఆ క్యారెక్టర్ పడే కష్టాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్స్ నితిన్, భరత్ ఈ కథని చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. హీరోయిన్ దీపికా పిల్లి చాలా అద్భుతంగా నటించింది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News