Tuesday, January 21, 2025

అప్పు తీర్చలేక కేరళలో ముగ్గురి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: అప్పు తీర్చలేక కేరళలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు తమకు తామే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 48 ఏళ్ల రమేశన్ అప్పు తీర్చడానికి అన్ని విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. అతడు మధ్యప్రాచ్య దేశంలో పనిచేసి బుధవారమే కేరళకు తిరిగొచ్చాడు. రమేశన్, అతడి భార్య సులజ కుమారి(46), కూతురు రేష్మ(23) తిరువనంతపురంలో శివారుల్లోని కదినంకుళంలోని తమ ఇంట్లో లోపలి నుంచి గడియపెట్టుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంట తాళలేక వారు అరిచినప్పుడు ఇరుగుపొరుగు వారు తలుపులు బద్ధలుచేసి వారిని కాపాడే ప్రయత్నంచేశారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. తలుపులు తెరుచుకోలేదు.

అదే ఇంట్లో నివసిస్తున్న రమేశన్ ముదుసలి అత్త మాత్రం నిక్షేపంగా ఉండడం ఇక్కడ గమనార్హం. అప్పు ఇచ్చిన వారి వేధింపులు తాళలేకే రమేశన్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని అతడి మామ తెలిపాడు. పోలీసులు సూసైడ్ నోట్‌ను ఆ ఇంట్లో నుంచి పొందారు. అసహజ మరణంగా కేసును నమోదుచేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News