Sunday, January 5, 2025

కర్ణాటకలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఈ సంఘటన బయటపడింది. మైసూరు పరిధి లోని చామండి పురానికి చెందిన మహాదేవస్వామి (45), తన భార్య అనిత(38).కూతుళ్లు చంద్రకళ (17), ధనలక్ష్మి (15) తో కలిసి ఉంటున్నాడు. మహాదేవ స్వామి కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రెండు రోజుల నుంచి ఆ ఇంటి తలుపులు తెరవక పోవడంతో స్థానికులు అనుమానంతో పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీస్‌లు వచ్చి తలుపులు తెరిచి చూడగా నలుగురు కూడా చనిపోయి ఉన్నారు. చంద్రకళ ఉరేసుకుని ఉండగా, మిగతా ముగ్గురు కిందపడి ఉన్నట్టు పోలీస్‌లు తెలిపారు. మహాదేవ స్వామి గత రెండు నెలలుగా ఈ ఇంటిలో కిరాయికి ఉంటున్నట్టు పోలీస్ ల దర్యాప్తులో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News