Wednesday, November 6, 2024

అప్పుల వేధింపులతో గోదావరిలో దూకి ముగ్గురు ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

అప్పుల వారి వేధింపులకు ఓ కుటుంబం బలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్‌లో ఉప్పలించి వేణు, అతని భార్య అనురాధ, కూతురు పూర్ణిమ నివాసం ఉంటున్నారు. వీరు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. గంజ్ మార్కెట్‌లో ఇద్దరు వ్యాపారులైన రోషన్, వికాస్ దగ్గర వేణు సుమారు 3 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు సకాలంలో తీర్చలేదని, అందుకు చక్రవడ్డీ వేసి కట్టాలని, లేకుంటే వయసున్న వారి కూతురు సంగతి తేలుస్తామని ఇంటికి మనషులను పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ బెదిరింపులు తట్టుకోలేక తనువు చాలించాలని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం బాసరకు కుటుంబ సమేతంగా చేరుకుని మొదటి ఘాట్ వద్ద గోదావరిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ్డారు. ఈ సంఘటన గమనించిన స్థానికులు కొందరు తల్లిని కాపాడారు. తండ్రి మృతదేహం లభ్యం కాగా, కుమార్తె గల్లంతైంది. ఆమె మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, అప్పులవారి బెదిరింపులు, వేధింపులు భరించలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు తెగబడ్డామని తల్లి అనురాధ తెలిపింది. సంఘటన స్థలం వద్ద చేరుకున్న ఎస్‌ఐ మహేష్, సిఐ మల్లేష్ వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News