Sunday, January 19, 2025

కుక్క పిల్ల అని పెంచుకుంటే అది కాస్తా…. (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: పెంపుడు జంతువులను పెంచుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలవాటే..అయితే మనం రెండేళ్లుగా పెంచుకుంటున్న జంతువు కుక్క కాదు క్రూర మృగమని తెలిస్తే ఎలాంటి భయంకర పరిస్థితి ఎదురవుతుందో మీరే ఊహించుకోండి. అలాంటి పరిస్థితే చైనా దంపుతులకు ఎదురైంది. కుక్క పిల్ల అనుకుని తెచ్చుకుని పెంచుకుంటే అది కాస్తా అడవుల్లో తిరిగే ఎలుగు బంటి అని తెలిసింది వారికి.

2016లో సెలవుల్లో టిబెట్‌కు వెళ్లింది సూ యున్ అనే మహిళ. అక్కడ టిబెటన్ బస్టిఫ్ బ్రీడ్ శునకం అనుకుని దాన్ని చైనాకు తీసుకువచ్చింది ఆమె. నలుపు, గోధుమ రంగు కలగలిపి ఉన్న బొచ్చుతో ముద్దుగా ఉందీ కుక్క పిల్ల అనుకుని అల్లారు ముద్దుగా దాన్ని పెంచుకోసాగారు ఆ దంపతులు. అయితే కొన్నాళ్లు పోయిన తర్వాత ఆ కుక్క పిల్ల రెండు కాళ్లతో నడవడం చూసి షాకయ్యారు వాళ్లు. దాని ముఖం కూడా కుక్కను పోలకుండా వేరే జంతువును పోలి ఉండడం కూడా వారి అనుమానాలకు బలమిచ్చింది.

అది మాంసాహారాన్ని ముట్టకుండా పండ్ల బుట్టపై పడడం, బకెట్ల కొద్దీ నూడుల్స్ తినడం కూడా వారికి ఆశ్చర్యపరిచింది. 250 పౌండ్ల బరువుతో భారీ సైజుతో అడ్డంగా పెరిగిపతోతున్న ఆ జంతువును చూసి వారికి భయమేసింది. వెంటనే ఆమె పోలీసులను పిలిపించి ఈ జంతువు సంగేతేంటో తేలమని అర్థించగా అది శునకం కాదు భల్లూకం అని తేల్చారు వారు. ఇది ఆసియా ఖండంలో అత్యంత అరుదుగా కనిపించే నల్ల ఎలుగుబంటని, దీన్ని పెంచుకోవడం చట్టరీత్యా నేరమని వారు చెప్పడంతో ఇన్నేళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ ఎలుగుని జూ అధికారులకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు ఆ దంపతులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News