Wednesday, January 22, 2025

రెండో రోజు బాక్సాఫీసు వద్ద రూ.8.9 కోట్లు ఆర్జించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు విజయ్ దేవరకొండ, నటి మృణాల్ ఠాకూర్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ దేశీయంగా బాక్సాఫీసు వద్ద రెండవ రోజున రూ. 8.9 కోట్లు ఆర్జించింది. ఈ విషయాన్ని sacnilk.com తెలిపింది. ఈ సినిమా మొదటి రోజున రూ. 9 కోట్లు రాబట్టింది. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5న విడుదల అయిందన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు కరీంనగర్ లో శనివారం అత్యధిక ఆక్యుపెన్సీ (57.5 శాతం) నమోదయింది. తరువాతి స్థానం వరంగల్ లో(43.5 శాతం) నమోదయింది. ఇదిలావుండగా విజయ్ దేవరకొండ అత్పల్ప ఓపెనింగ్ సినిమా ఇటీవల ఇదేనని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పేర్కొంది. పైగా ఇటీవల విడుదలయి అత్పల్ప డబుల్ డిజిట్ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన ఆయన సినిమాలను ఉటంకించింది.  వాటిలో ఖుషి రూ. 15.25 కోట్లు, లైగర్ రూ. 15.95 కోట్లు, డియర్ కామ్రేడ్ రూ. 11.90కోట్లు, వరల్డ్ ఫేమస్ లవర్ రూ. 7 కోట్లు అని పేర్కొంది. వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా సంక్రాంతికి విడుదల కావలసిన సినిమా, కానీ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా వాయిదా పడి ఇటీవల విడుదలయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News