Sunday, December 22, 2024

గుమ్మడికాయ కొట్టేసిన ‘ఫ్యామిలీ స్టార్’

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. మూవీ టీమ్ గుమ్మడికాయ కొట్టేశారు. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన లిరికల్ సాంగ్స్, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ‘ఫ్యామిలీ స్టార్‘ సమ్మర్ బ్లాక్‌బస్టర్ గ్యారంటీ అనే నమ్మకం ఈ పాజిటివ్ వైబ్స్‌తో ఏర్పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News