Monday, December 23, 2024

#OTT: ఓటీటీలోకి ‘ఫ్యామిలీ స్టార్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ల కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ త్వరలో ఓటీటీకి రాబోతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే విడులైన ఈ సినిమా కొన్ని థియేటర్లలో ఇంకా రన్ అవుతోంది. ఈ క్రమంలో మే 3న ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్ల ఫిలీం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను కొద్దరోజుల్లో మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విడుదలకు మందు.. రోజూ ఓ అప్డేట్ ఇస్తూ ఆసక్తి పెంచడంతో అభిమానులు మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ నిరాశపర్చింది. దీంతో పెద్దగా కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. వెండి తెరపై అనకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోని ఫ్యామిలీ స్టార్.. మరి ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటోదో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News