Wednesday, January 22, 2025

నిజామాబాద్ జిల్లాలో దారుణం

- Advertisement -
- Advertisement -

ఎడపల్లి : నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్య హత్యయత్నం చేయగా తండ్రి మృతి, భార్య పరిస్థితి విషమము ఇద్దరి బాలుర ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్‌లో నివాసం ఉంటున్న సాయిలు దిన కూలీగా పని చేస్తు జీవనం కొనసాగిస్తున్న అతడికి అప్పుల బాధలు తాళలేక అర్థరాత్రి సమయంలో కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు.

వారిని హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సాయిలు మృతి చెందాడు. అతని భార్య రేఖ పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు బాలురు అయిన చరణ్ (14), అరుణ్ (12) వీరి పరిస్థితి నిలకడగా ఉంది. బాలురు 7వ తరగతి ఒకరు, 6వ తరగతి విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News