Sunday, January 19, 2025

మనిషిని ఎక్స్ రే తీసినట్టు సమగ్ర కుటుంబ సర్వే…

- Advertisement -
- Advertisement -

మంచి ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలి
ఇప్పటివరకు 67 లక్షల 76 వేల 203 కుటుంబాల సర్వే పూర్తి
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: మనిషిని ఎక్స్ రే తీసినట్టు సమగ్ర కుటుంబ సర్వే స్పష్టంగా జరుగుతోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సర్వేపై, కులగణనపై విపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నాయని ఆయన మండి పడ్డారు. సోమవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము ఇప్పుడు సరిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. మంచి ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలని మంత్రి పొంగులేటి హితవు పలికారు. సిఎం రేవంత్ రెడ్డి ఎంతో దూరదృష్టితో ఈ సర్వే చేపట్టారని మంత్రి తెలిపారు.

హైదరాబాద్‌లో 37 శాతం సర్వే పూర్తి

ఈ సర్వే శాస్త్రీయంగా జరుగుతుందని, హడావుడి లేదని మంత్రి పొంగులేటి తెలిపారు. కోటి 16 లక్షల 14 వేల 349 కుటుంబాలు ఉన్నట్టు అంచనాకు వచ్చామని, ఈ నెల 9వ తేదీ నుంచి సర్వే జరుగుతుందని, 58.3 శాతం అంటే 67 లక్షల 76 వేల 203 కుటుంబాల సర్వే జరిగిందని ఆయన తెలిపారు. ఏ కుటుంబానికి ఏమీ అవసరం? ఏ గ్రామానికి ఏం అవసరం అనేది సర్వే ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. ములుగు జిల్లా, నల్గొండ, జనగామ జిల్లాల్లో అధిక శాతం సర్వే పూర్తి అయ్యిందన్నారు. హైదరాబాద్ లో 37 శాతం సర్వే జరిగిందని చేసిన సర్వేను ఫార్మేట్ ప్రకారం కంప్యూటరీకరణ జరుగుతుందన్నారు. ఈనెల 30వ తేదీతో సర్వే ప్రక్రియ పూర్తి అవుతుందని, సరైన మార్గంలో సర్వే జరుగుతుందని ఆయన అన్నారు.

ఉనికే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో…

ఉనికే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. సర్వే జరిగితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రాకుండా పోతాయని గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు ఆగిపోవని, అర్హులైన వారికి పథకాలు తప్పకుండా వస్తాయని ఆయన తెలిపారు. సర్వేలో ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని, ప్రతిపక్షాలు చెప్పేవి నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ లబ్ధికోసమే సర్వేపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు గతంలో బిఆర్‌ఎస్ సర్వే చేసి పేద ప్రజలకు మంచి చేసే పనులు ఏమైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని ఆయన అన్నారు.

ఆ సర్వే వివరాలు ఇప్పటికీ తమకే తెలియదన్నారు. ఈ సర్వే ద్వారా ప్రజల ఆస్తులను తెలుసుకొని బిఆర్‌ఎస్ నాయకులు వారి ఆస్తులుగా బదిలీ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ నాయకుల ఆస్తులు పెంచుకోవడానికి సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడిందని ఆయన అన్నారు. ఇప్పటివరకు గత సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కెటిఆర్, హరీష్‌రావుల కుటుంబాలు కూడా సర్వేలో పాలు పంచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత సర్వేలో పాల్గొనడం సంతోషించదగ్గ విషయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News