- Advertisement -
బెంగళూరు: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచివెళ్లారు. తాజాగా మరో కమెడియన్ తుదిశ్వాస విడిచారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన బ్యాంకు జనార్ధన్(77) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు.
1948లో జన్మించిన జనార్థన్ తొలుత బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. చిత్రరంగంపై ఆసక్తితో అందులో ప్రవేశించి అక్కడ సక్సెస్ అయ్యారు. బ్యాంకు ఉద్యోగం చేసిన కారణంగా ఆయన్ని బ్యాంకు జనార్థన్ అని పిలుస్తారు. అన్ని భాషల్లో కలిసి 500లకు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ ఆయన పలు చిత్రాల్లో నటించారు. ఖననం, రిదం, లాస్ట్ పెగ్, ఉపేంద్ర-2 వంటి చిత్రాల్లో నటించిన ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. జనార్ధన్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
- Advertisement -