- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని తన ఇంట్లోనే అతడు తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. గౌతమ్ రాజు మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. “చట్టానికి కళ్లు లేవు” అనే సినిమాకు తొలుతగా ఎడిటింగ్ చేసి టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేశారు. ఆది చిత్రానికి ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు అందుకున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు. ఆయన దాదాపుగా 850 చిత్రాలకు ఎడిటింగ్ చేశారు.
- Advertisement -