Monday, December 23, 2024

ప్రముఖ వాస్తు నిపుణులు చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Famous Vastu expert Chandrashekhar Guruji brutally murdered

హుబ్లీ ( కర్ణాటక) : ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ మంగళవారం హుబ్లీ లోని ఒక హోటల్‌లో దారుణ హత్యకు గురయ్యారు. హోటల్ రెసెప్షనిస్టు ఏరియాలో ఇద్దరు వ్యక్తులు ఆయనను పలుమార్లు పొడిచి చంపినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిందని పోలీసులు తెలిపారు. హుబ్లి పోలీస్ కమిషనర్ లబ్దురామ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నాగల్ కోట్ కు చెందిన గురూజీ కాంట్రాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత కుటుంబ సభ్యులతో ముంబైలో స్థిరపడ్డారు. అనంతరం సరళ వాస్తు చెబుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. మూడు రోజుల క్రితం ఆయన కుటుంబం లోని ఓ పిల్లవాడు మృతి చెందాడు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హుబ్లీ వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News