నాగ్‌పూర్: విక్కీ కౌశల్, రష్మిక మందనా హీరోహీరోయిన్లుగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఛావా’. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై ఘన విజయం సాధించింది. విడుదలైన తొలిరోజే రూ.31 కోట్లు వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా రూ. 121 కోట్లు వసూళ్ల వర్షం కురిపించినట్టు సమాచారం.
అయితే ఈ సినిమా చూసేందుకు ఓ అభిమాని వినూత్న ప్రయత్నం చేశారు. సినిమా ప్రదర్శన పూర్తి కాగానే శంభాజీ మహారాజ్ గెటప్‌లో గుర్రంపైనే థియేటర్ స్క్రీన్ ముందుకు వచ్చారు. థియేటర్‌లో ఆయన ‘హరహర మహదేవ్’, ‘జై భవానీ’ అంటూ నినాదాలు చేశారు. ఇది చూసిన ప్రేక్షకులు ‘జై శంభాజీ మహారాజ్’ అంటూ నినదించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, ఈ సినిమాను చూసిన మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర కామెంట్ చేశారు. శంభాజీ మహారాజ్ గురించి స్కూల్ పాఠ్యాంశాల్లో ఎందుకు బోధించలేదు అంటూ ఆయన సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించారు. అయితే దీనిపై కొందరు ఆకాశ్‌కు మద్ధతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం వివాదం చేయవద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Chhaava Movie: 'छावा' पाहायला घोड्यावरून संभाजीराजांची वेषभूषा धारण करत आला तरुण…थेट चित्रपट गृहात एन्ट्री, व्हिडिओ पाहा #Chhaava #ChhaavaInCinemas #ChhaavaReview pic.twitter.com/Lihl3RBLXo
— sandip kapde (@SandipKapde) February 14, 2025