Friday, December 20, 2024

బాలకృష్ణను కలిసేందుకు నదిలో దూకేశాడు…

- Advertisement -
- Advertisement -

Fan jumps into river to meet nandamuri balakrishna

హిందూపురం: నందమూరి బాలకృష్ణ అభిమాని తన అభిమాన నేతను కలిసేందుకు హిందూపురంలో నదిలో దూకిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇటీవల ముంపునకు గురైన హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. బాలకృష్ణ నియోజకవర్గ పర్యటనకు వస్తున్న సమయంలో కూలిన వంతెనపై ఉన్న ఓ వ్యక్తి తన అభిమాన నటుడు,నాయకుడిని చూసి షాక్ అయ్యాడు. వీడియోలో, నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవతలి వ్యక్తులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కానీ, ఆ వ్యక్తి బాలకృష్ణను కలిసేందుకు నదిలోకి దూకి ఈదాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News