ఢాకా : బంగ్లాదేశ్‌లో మరోసారి ముస్లిం మతోన్మాదులు రెచ్చిపోయారు. ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ హిందూ దేవాలయం పైనా, హిందువుల ఇళ్లపైనా దాడులు చేసి నిప్పుపెట్టారు. ఈ సంఘటన శుక్రవారం ప్రార్ధనల తరువాత జరిగిందని, పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. నరాయిల్ జిల్లా , డిఘోలియా గ్రామంలో శుక్రవారం ప్రార్థనల తరువాత మైనారిటీ హిందువుల దేవాలయం, ఇళ్లపై ఇస్లామిస్టులు దాడులు చేశారు. ఓ హిందూ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని ఇస్లామిస్టులు ఆరోపించారు. ఓ హిందూ కుటుంబానికి చెందిన ఇంటిని తగుల బెట్టారు. దాడులకు పాల్పడుతున్న ఇస్లామిస్టులను చెదరగొట్టేందుకు గాలి లోకి కాల్పులు జరిపినట్టు పోలీస్ అధికారి హరన్ చంద్రపౌల్ తెలిపారు. ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టిన ఆకాశ్ సాహాను, ఆయన తండ్రి అశోక్ సాహాను కస్టడీ లోకి తీసుకున్నట్టు పోలీస్ సూపరింటెండెంట్ ప్రబిర్ కుమార్ రాయ్ చెప్పారు.
బంగ్లాదేశ్‌లో మతోన్మాదం… హిందూ దేవాలయం, ఇళ్లు అగ్నికి ఆహుతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -