Friday, November 15, 2024

ఫ్యాన్సీ నెంబర్ల దందా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:రవాణాశాఖలో ఫ్యాన్సీ నెంబర్‌ల కుంభకోణం జరుగుతోం ది. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతోందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా ఈ తంతు జరుగుతు న్నా దాని గురించి పట్టించుకునే వారు లేర ని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. ఫ్యాన్సీ నెంబర్ల గుట్టును దళారులు, వాహన యజమానులకు చెప్పి వారితో తక్కువకు కోట్ చేయించి అనంతరం వారి నుంచి లక్షల రూపాయలను తీసుకుంటున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నా యి. అయితే ఈ వ్యవహారం అంతా గత ప్రభుత్వంలో ఉన్నత పదవిలో కొనసాగిన ఓ అధికారి కనుసన్నల్లోనే జరిగిందని, ప్రస్తుతం ఆ అధికారి ఈ శాఖలో లేకున్నా ఆయన నియమించిన ఔట్‌సోర్సింగ్‌తో పాటు రెగ్యులర్ ఉ ద్యోగులు కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణాశాఖలో ఇలా ఆ అధికా రి 10 ఏళ్లలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని సిఎం రేవంత్‌కు, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చాలామంది రవాణా శాఖ ఉద్యోగులు ఫిర్యా దు చేశారు. ఆ అధికారి వెళ్లిపోయినా ఆ అధికారి ఆనవాళ్లు ఇంకా ఈ శాఖలో కొనసాగుతున్నాయని ప్రస్తుతం ఆ శాఖ ఉద్యోగులు మరోసారి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం.

ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకానికి భారీగా ముడుపులు
10 ఏళ్లలో ఆ అధికారి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి భారీగా ముడుపులు తీసుకున్నారని అప్పుడు అమ్యామ్యాలను చెల్లించిన సిబ్బంది ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిసింది. గత పదేళ్లలో ఆ అధికారి హయాంలో నియామకం అయిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పాటు కొందరు రెగ్యులర్ ఉద్యోగులు ప్రస్తుతం రవాణాశాఖలో ఆడింది ఆట పాడింది పాట కొనసాగుతోందని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా ఫ్యాన్సీ నెంబర్‌ల కుంభకోణం జరుగుతోందని, దీనివల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు.
ఆన్‌లైన్‌లో ఎంత కోట్ చేశారో..?
ప్రస్తుతం రవాణాశాఖలో ఫ్యాన్సీ నెంబర్‌లను వేలం వేసినప్పుడు ఆ డేటా మొత్తం టెక్నికల్ టీం వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎవరు ఫ్యాన్సీ నెంబర్‌ల కోసం ఎంత కోట్ చేశారన్న విషయాలు టెక్నికల్ టీం వద్ద ఉంటాయి. ఇలా టెక్నికల్ టీం ఎవరు ఎంత కోట్ చేశారన్న విషయాన్ని కొందరు దళారులకు, ఫ్యాన్సీ నెంబర్‌లు కావాల్సిన వాహన యజమానులకు తెలియచేసి వారితో కుమ్మక్కై లక్షల రూపాయలను వెనుకేసుకున్నట్టుగా సమాచారం. గతంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఇలా దళారులతో కుమ్మక్కై ఈ దందాను నడిపించినట్టుగా తెలిసింది.

బిడ్డింగ్‌లో పాల్గొనాలంటే రూ.10 వేల నుంచి రూ.20 వేల ఫీజు
రవాణా శాఖ ఫ్యాన్సీ నెంబర్‌లకు ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తుంది. (ఉదా..9999 నెంబర్ కోసం) బిడ్డింగ్‌లో పాల్గొనాలంటే రవాణా శాఖకు రూ.10 వేల నుంచి రూ.20 వేల ఫీజును ముందుగా చెల్లించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బిడ్డింగ్ పాల్గొనాల్సి ఉంటుంది. ఎవరూ ఆ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోకపోతే ఒక్కరే దరఖాస్తు చేసుకుంటే వారికే రవాణా శాఖ నిర్ణయించిన ధర కన్నా కొంచెం ఎక్కువ ధరకు ఆ నెంబర్‌ను కేటాయిస్తారు. ఒకవేళ ఆ నెంబర్‌కు దరఖాస్తులు ఎక్కువగా వస్తే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తారు. ఆ సమయంలో దరఖాస్తుదారుల్లో కొందరితో టెక్నికల్ టీం బేరసారాలు జరుపుకొని ప్రభుత్వానికి రావాల్సిన ధర కన్నా తక్కువ ధరకే ఈ ఫ్యాన్సీ నెంబర్‌లను కేటాయిస్తూ కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్టుగా తెలిసింది. కొన్నిసార్లు ప్రభుత్వానికి రూ.70 నుంచి రూ.80 లక్షల్లో ఆదాయం ఆదాయం రావాల్సి ఉన్నా టెక్నికల్ టీం, రవాణా శాఖ ఉద్యోగుల అవినీతి వల్ల రూ.10 నుంచి రూ.15 లక్షలు మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతి దానికి ఒక రేటు…
దీంతోపాటు రవాణా శాఖలో జరిగిన తుక్కుదందాలో కోట్ల రూపాయలను వెనకేసుకున్న ఉద్యోగుల్లో ఆయన మనుషులే ఎక్కువగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తుక్కుదందాతో కొందరు ఉద్యోగులు, అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా రవాణా శాఖలో ప్రతి దానికి ఒక రేటును ఫిక్స్ చేసి కోట్లను వెనుకేసున్న అధికారులపై ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News