Wednesday, January 22, 2025

నవజోత్ సింగ్ సిధును స్వాగతించేందుకు పోటెత్తిన సపోర్టర్లు

- Advertisement -
- Advertisement -

పాటియాల: పాటియాల జైలులో 10 నెలలు జైలు జీవితం గడిపిన కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిధు నేడు(శనివారం) పాటియాల జైలు నుంచి విడుదల కానున్నారు. ఆయనను రిసీవ్ చేసుకునేందుకు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున జైలుకు చేరుకున్నారు. జైలు వెలుపల అనేక మంది కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు నిలుచుని ‘నవజోత్ సిధు జిందాబాద్’ అని నినాదాలు చేశారు.

మద్దెల వాయించే వారిని కూడా మద్దతుదారులు జైలు వెలుపల ఏర్పాటుచేశారు. ‘జైలు నుంచి ఆయన ఎప్పుడు బయటికి వస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాం’ అని సిధు కుమారుడు కరణ్ సిధు తెలిపారు. తాము ఇన్నాళ్లు ఆయనకు దూరంగా ఉంటూ కాలాన్ని గడ్డుగా గడిపామని, ఇప్పుడు సంతోషంగా ఉందని అన్నారు. నవజోత్ సింగ్ సిధుకు సంబంధించిన పోస్టర్లు కూడా పాటియాలలోని అనేక చోట్ల కనిపించాయి. ‘సిధు ఎప్పుడు జైలు వెలుపలికి వస్తారా అని పంజాబ్ ప్రజలు ఎదురుచూస్తున్నారు’ అని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంఎల్‌ఏ నవతేజ్ సింగ్ చీమా తెలిపారు. సిధు విడుదలకు సంబంధించిన సమాచారం ఆయన కుటుంబానికి అధికారులు అందజేశారు.

Fans, supporters throng Patiala jail to welcome soon-to-be-released Navjot Sidhu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News