Monday, December 23, 2024

మెగా టోర్నీకి ఆదరణ కరవు

- Advertisement -
- Advertisement -

కనిపించని జోష్..

మన తెలంగాణ/ క్రీడా విభాగం: వెస్టిండీస్, అ మెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ అభిమానులను అలరించడంలో విఫలమైందనే చెప్పాలి. ఇటీవల భారత్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ క్రికెట్ ప్రేమీకులను కనువిందు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే టి20 ప్రపంచకప్ ప్రారంభమైంది. అయితే ఈ మెగా టోర్నీ మాత్రం అభిమానులను ఏమాత్రం ఆకట్టు కోవడం లేదు. వెస్టిండీస్, అమెరికాలో వరల్డ్‌కప్ జరుగుతుండడం, ఇది ఉపఖండంతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర దేశాల కాలమానానికి అనుకూలంగా లేక పోవడంతో ప్రపంచకప్ మ్యాచ్‌లను చూసేందు కు అభిమానులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.

ఒక్క భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు మాత్రమే అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. మిగిలిన మ్యాచ్‌లను ఎవ రూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అమెరికాలో ని న్యూయార్క్, ఫ్లోరిడా నగరాల్లో కూడా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరిగినా ఫలితం లేకుండా పో యింది. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇం గ్లండ్ తదితర దేశాల్లో మెగా టోర్నమెంట్ జరిగితే అభిమానుల బ్రహ్మరథం పట్టడం అనవాయితీగా వస్తోంది. కానీ విండీస్‌లో జరుగుతున్న టి20 ప్రపంచకప్‌కు మాత్రం ఆదరణ కరువైంది. మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఇక చాలా మ్యాచుల్లో తక్కువ స్కోర్లే నమోదవుతున్నాయి. ప్రతి జట్టులోనూ స్టార్ ఆటగాళ్లు ఉన్నా అభిమానులను అలరించడంలో విఫలమవుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా, విండీస్, ఇంగ్లండ్ తదితర జట్లు ఆడే మ్యాచ్‌లకు మాత్రమే కాస్త స్పందన లభిస్తోంది.

మిగతా జట్ల మ్యాచ్‌లనూ ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలోనూ వెస్టిండీస్ వేదికగా జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈసారి కూడా వరల్డ్‌కప్‌కు ఏమాత్రం ఆదరణ లభించడం లేదు. క్రికెట్‌ను జనరంజక ఆటగా తీర్చిదిద్దాలని భావిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి ఈ పరిణామం మింగుడు పడడం లేదు. బిగ్‌బాష్, ఐపిఎల్, బంగ్లా ప్రీమియర్ లీగ్, సౌ తాఫ్రికా, పాకిస్థాన్ లీగ్ క్రికెట్‌కు లభించినా ఆదరణ కూడా వరల్డ్‌కప్ టోర్నీకి దక్కక పోవడం నిజంగా ఆందోళన కలిగించే అంశమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News