Friday, December 20, 2024

దేవర రిలీజ్.. అర్ధరాత్రి థియేటర్‌లో ఘర్షణ

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ, ఎపి రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ సందడి చేస్తోంది. శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభమయ్యాయి. దీంతో అభిమానులు సెలబ్రేషన్స్ మూడ్ లోకి వెళ్ళిపోయారు. థియేటర్స్ దగ్గర నానా రచ్చ చేస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అభిమానులతో థియేటర్స్ వద్ద రద్దీ నెలకొంది.

అయితే, కడప రాజా హాలులో అర్ధరాత్రి ‘దేవర’ షో నడుస్తుండగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు అభిమానులు టికెట్లు లేకుండా థియేటర్‌లోకి ప్రవేశించడంతో.. మరికొందరు అభిమానులు పరస్పరం దాడులకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఎంటరై అందరినీ చెదరగొట్టారు. ఇక, దేవర సినిమా విషయానికి వస్తే.. అభిమానులు బ్లాక్ బస్టర్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News