Sunday, December 22, 2024

6 కిలోమీటర్ల పొడవైన దారంతో హరీశ్ రావు చిత్రం రూపకల్పన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉప్పొంగిన అభిమానం. సిద్ధిపేటకు చెందిన ముగ్గురు యువకులు మంత్రి హరీశ్‌రావుపై అభిమానంతో వినూత్న కానుకను అందజేశారు. ఆ యువకులు ఇచ్చిన బహుమానం చూసి ముగ్ధుడయ్యారు. తనపై వారికి ఉన్న ప్రేమకు ఉప్పొంగి పోయారు. సిద్ధిపేట యువకులు మంత్రి హరీశ్‌రావు చిత్రాన్ని, దారంతో వేసి తమ అభిమానం చాటుకున్నారు. ముగ్గురు యువకులు దాదాపు రెండు వారాలు శ్రమిం చి, 4వేల మలుపులతో దాదాపు 6 కిలోమీటర్ల పొడవైన దారంతో 6 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వెడల్పు సైజ్ తో పూర్తిగా దారంతోనే ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘హరీశ్ రావు సిద్దిపేటను ఇంత ఘనంగా అభివృద్ధి చేస్తున్నాడు.

రాష్టంలోనూ, దేశంలోనూ సిద్దిపేటను అభివృద్ధిలో అకాశం అంత ఎత్తులో ఉంచాడు, ఎంతో కొంత సిద్దిపేట ప్రజలుగా, ప్రజల కోరకు, ప్రజల ఆలోచనలను నిజం చేసి సిద్దిపేట అభివృద్ధిని ఎల్లలు దాటించిన హరీశ్ రావుకు ఉడుతా భక్తి గా దారంతో ఆర్ట్ వేయాలని నిర్ణయించుకున్నారు. థ్రెడ్ ఆర్ట్ అనేది క్రీడాకారులు, సినీ ఆర్టిస్ట్ లకు, గొప్ప కీర్తి తెచ్చిన వ్యక్తుల గురించి చేస్తారు. సిద్దిపేటలో గొప్ప అభివృద్ధి చేసిన నాయకునికి థ్రెడ్ ఆర్ట్ తో వినూత్న అభిమానాన్ని’ సిద్దిపేట యువకులు వ్యక్తపరిచారు. హరీశ్‌రావు మరోసారి ఎన్నికల్లో లక్షకు పైన మెజార్టీ రావాలని కోరుకుంటున్నామని ముగ్గురు యువకులు అన్నారు. యువకులు చూపిన అభిమానానికి మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆ యువకులను నిండు మనసుతో అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News