హిట్‌మ్యాన్ కెప్టెన్సీపై అభిమానుల ఫైర్
దుబాయి : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురుస్తోంది. తిరుగులేని కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్‌కు ఆసియాకప్ ఓ పీడకలగా మారింది. వరుస ఓటములతో రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతను తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారా యి. కెప్టెన్‌గా ఐపిఎల్‌తో పాటు టీమిండియాపై తనదైన ముద్ర వేసిన ఘనత రోహిత్ సొంతం. అయితే ఆసియాకప్‌లో మాత్రం అతనికి చేదు అనుభవమే ఎదురవుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పాటు శ్రీలంకతో జరిగిన సూపర్4 మ్యాచుల్లో జట్టును విజయపథంలో నడిపించడంలో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచుల్లోనూ రోహిత్ కెప్టెన్సీ పరమ చెత్తగా ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడంలో రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడని, అందుకే జట్టుకు ఇలా ంటి చేదు ఫలితాలు తప్పడం లేదని వారు విమర్శలు గుప్పించారు. ఆసియాకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన పేలవమైన ప్రదర్శనతో కనీసం ఫైనల్‌కు చేరడం కూడా క్లిష్టంగా మార్చుకుంది. అలవోకగా ట్రోఫీని సాధిస్తుందని భావించిన టీమిండియా కనీసం టైటిల్ పోరు అర్హత సాధించే పరిస్థితి కూడా లేకు ండా పోయింది. ఆటగాళ్లకు అండగా నిలువాల్సిన కెప్టెన్ వారిపై చిందులు వేయడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు.
యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ విషయంలో రోహిత్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బౌలర్‌కు ధైర్యం చెప్పాల్సింది పోయి తిట్లదండకం అందుకోవడంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తుది జట్టు ఎంపికలో కూడా రోహిత్ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. కొంతమంది క్రికెటర్లను అతను కావాలనే పక్కన బెడుతున్నాడని ఆరోపిస్తున్నారు. దినేశ్ కార్తీక్, అశ్విన్ వంటి కీలక ఆటగాళ్లను తుది జట్టుకు దూరంగా ఉంచడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక పాక్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన రవిబిష్ణోయ్‌ను లంక మ్యాచ్‌లో పక్కన బెట్టడాన్ని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ప్రపంచకప్ ముంచుకొస్తున్న సమయంలో రోహిత్ కెప్టెన్‌గా విఫలం కావడం అందరిని కలవరానికి గురిచేస్తోంది. ఐపిఎల్‌లో ముంబైని పలుసార్లు ఛాంపియన్‌గా నిలుపడడం తో రోహిత్ కెప్టెన్సీపై అంచనాలు పెరిగాయి.
కానీ అతను సారథ్యం వహించిన తర్వాత టి20 ఫార్మాట్‌లో టీమిండియా వరుస ఓటమలు పాలుకావడం ఆందోళన కలిగిస్తోంది. విరాట్ కోహ్లి కంటే రోహిత్ కెప్టెన్సీ బాగుంటుందని భావించిన వారికి నిరాశే మిగిలిం ది. వరల్డ్‌కప్‌కు ముందు జరుగుతు న్న కీలక టోర్నీలో రోహిత్ ప్రయోగాలకు దిగడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, రిషబ్‌పంత్ తదితరులను ఆడించినా ఫలితం లేకుండా పోయింది. ఇక గాయంతో జట్టుకు దూరమైన జడేజా స్థానంలో అశ్విన్‌ను ఎంపిక చేయక పోవడం కూడా రోహిత్‌పై విమర్శలకు మరో కారణంగా చెప్పొచ్చు. హార్దిక్ పాండ్య సేవలను కూడా రోహిత్ సందర్భోచితంగా వాడుకోలేక పోతున్నాడు. అతనికి ఆరంభంలోనే బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఎదురైన ఓటములతో రోహిత్‌పై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి స్థితిలో రానున్న ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన నెలకొంది.