Sunday, January 19, 2025

రెండో రోజుకల్లా ‘కల్కి’ సినిమా మొత్తంగా రూ. 298.5 కోట్లు ఆర్జించింది!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైజయంతీ మూవీస్ పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమా ‘కల్కి 2898 ఏడి’ గురువారం ఆరు భాషల్లో- తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  విడుదలయింది. ఈ సినిమా మహాభారత పౌరాణికం, సైన్స్ కల్పితం నేపథ్యంతో తీసిన సినిమా. కాగా ఈ సినిమా శుక్రవారం రెండో రోజున మొత్తంగా రూ. 298.5 కోట్లు గడించింది.

ఈ సినిమా ముఖ్య పాత్రల్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, శోభనా నటించారు. మొదటి స్థూలంగా రూ. 191.5 కోట్లు, రెండో రోజు రూ. 107 కోట్లు ఈ సినిమా రాబట్టింది. మొదట్లో ఈ సినిమాను ‘ప్రాజెక్ట్ కె’ అనే టైటిల్ తో భారీ ఖర్చుతో (రూ. 600 కోట్లతో) నిర్మించారని వినికిడి. ఇప్పుడు హైదరాబాద్, ముంబయి సహా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రేక్షకులు తిలకిస్తున్నారు. బడా నటులు సైతం ఈ సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News