Monday, December 23, 2024

హార్దిక్‌పై అభిమానులు ఫైర్

- Advertisement -
- Advertisement -

Fans fire on Hardik pandya

ముంబై: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా హార్దిక్ సహచర ఆటగాళ్లు తరచూ నోరు పారేసుకున్నాడు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీపై హార్దిక్ తీవ్ర పదజాలంతో విరుచుకపడ్డాడు. హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి అందించిన క్యాచ్‌ను షమీ అందుకోలేక పోయాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన హార్దిక్ అతనిపై చిందులు వేశాడు. హార్దిక్ వ్యవహారశైలీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆటలో క్యాచ్‌లు జారవిడచడం సర్వసాధారణమని ఇది ఆటలో భాగమని, అయితే హార్దిక్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీనియర్ బౌలర్‌పై చిందులు వేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News