Monday, December 23, 2024

అమితాబ్ ని బాత్రూమ్ లో పెట్టి తాళం వేయాలి

- Advertisement -
- Advertisement -

ఇప్పుడు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నది ఇదే. అమితాబ్ ని ఎవరైనా బాత్రూమ్ లో పెట్టి తాళం వేస్తే బాగుంటుందని నెటిజన్లు సలహా ఇస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, న్యూజీలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గెలవగానే, బిగ్ బీ అమితాబ్ ఓ ట్వీట్ చేశారు. ‘నేను మ్యాచ్ చూడకపోతే టీమిండియా గెలుస్తోంది’ అన్నది ఆ ట్వీట్ సారాంశం.

దీంతో అభిమానులు ఆ పోస్టుపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఓ వీరాభిమాని ఫైనల్ మ్యాచ్ జరిగే రోజున అమితాబ్ ని బాత్రూమ్ లో పెట్టి తాళం వేస్తే బాగుండునని ట్వీట్ చేశాడు. మరొకరు  ‘సర్, దయచేసి ఆ రోజు మీరు మ్యాచ్ చూడకండి’ అని ప్రాధేయపడ్డారు. ఇంకొక అభిమాని కళ్లకు గంతలు కట్టుకున్న ఫోటో పెట్టి, ఆదివారంనాడు మీరు ఇలా ఉండండి సర్ అని ట్వీట్ చేశాడు. ఇంకొక అభిమాని ‘బచ్చన్ సర్, ఆ రోజు మీరు కళ్లకు గంతలు కట్టుకుని బేస్ మెంట్ లో పడుకోండి. రాత్రి టపాకాయల శబ్దం విన్నాక, బయటకు రండి’ అని సలహా ఇచ్చాడు. ఇంతకీ ఆ రోజు బిగ్ బీ ఏం చేస్తాడో మరి?

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News