న్యూఢిల్లీ : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు తొలి రోజు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇష్యూ ప్రారంభమైన ఒక గంటలోనే రిటైల్ భాగం పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అయింది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం జోమాటో 10 శాతం వాటాను కేటాయించింది. ఈ ఐపిఒ జూలై 16 న ముగుస్తుంది. ఇష్యూ ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.7276 మధ్య ఉంది. ఐపిఒ నుంచి రూ.9,375 కోట్లు సేకరించాలని కంపెనీ యోచిస్తోంది. యాంకర్ పెట్టుబడిదారుల నుండి జొమాటో రూ.4,196 కోట్లు సమీకరించింది. మొత్తం 552,173,505 షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు యూనిట్‌కు రూ.76 చొప్పున జారీ చేయాలని కంపెనీ నిర్ణయింది. ఈ షేర్ల మొత్తం విలువ రూ.4,196 కోట్లు ఉంటుంది. ఈ పెట్టుబడిదారులలో బ్లాక్‌రాక్, టైగర్ గ్లోబల్, ఫిడిలిటీ, న్యూవరల్డ్ ఫండ్, జెపి మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా వంటి విదేశీ పెట్టుబడిదారులు ఉన్నారు.