Monday, December 23, 2024

కావేరీ సీడ్ కంపెనీని సందర్శించిన ఎఫ్ఎఒ డైరెక్టర్ జనరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) డైరెక్టర్ జనరల్, డాక్టర్ క్యూ డోంగ్యు, FAO ప్రతినిధి బృందంతో కలిసి జూన్ 15, 2023న కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్‌ని సందర్శించారు. ఈ పర్యటన ఉద్దేశ్యం కంపెనీ అడ్వాన్స్‌డ్ జెనోమిక్స్ లాబొరేటరీని గమనించి, దాని కొనసాగుతున్న బయోటెక్ ప్రోగ్రామ్‌లను గురించి తెలుసుకోవటం.

డాక్టర్ క్యూ డోంగ్యుతో పాటుగా గౌరవనీయులైన FAO ప్రతినిధులు కూడా ఉన్నారు, వీరిలో డైరెక్టర్ జనరల్‌కు అసిస్టెంట్ అయిన Mr. Zhe Xiong, భారతదేశంలో FAO ప్రతినిధి Mr. Takayuki Hagiwara, కమ్యూనికేషన్ & రీసెర్చ్ స్పెషలిస్ట్ శ్రీమతి లిల్లీ పాల్, FAOR (ప్రోగ్రామ్) కొండ చవ్వా, IT స్పెషలిస్ట్ శ్రీ దీపేష్ సోలంకి వున్నారు.

ఈ పర్యటనలో కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. భాస్కర్ రావు, డాక్టర్ క్యూ డోంగ్యు మరియు FAO ప్రతినిధులకు కంపెనీ గురించిన సమగ్ర సమాచారం అందించారు. భాస్కర్ రావు భారతదేశ వ్యవసాయానికి కావేరీ విత్తన కంపెనీ యొక్క గణనీయమైన సహకారాన్ని, భారతదేశంలో అతిపెద్ద విత్తన ఉత్పత్తిదారుగా దాని పాత్రను వెల్లడించారు.

డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డోంగ్యు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, హరిత విప్లవం మరియు వ్యవసాయ సమాజానికి కావేరీ విత్తనాలు అందించిన గణనీయమైన కృషిని గుర్తించారు. రైతులకు నీటిపారుదల మరియు నాణ్యమైన విత్తనాల సరఫరా ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారతదేశ వ్యవసాయంలో కావేరీ విత్తనాల కీలక పాత్రను సైతం గుర్తించారు.

భాస్కర్ రావు మాట్లాడుతూ, “కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్‌కి FAO డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డోంగ్యు సందర్శన భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత మరియు ఆహార భద్రతను పెంపొందించడంలో సంస్థ యొక్క కీలక పాత్రకు పెరుగుతున్న గుర్తింపును సూచిస్తుంది. 75 మిలియన్లకు పైగా భారతీయ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే తమ మిషన్‌కు తాము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News