Saturday, November 23, 2024

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ఆత్మీయ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. దశాబ్ద కాలం పాటు తనతో పని చేసిన సిబ్బందిని కలిసి వారితో ముచ్చటించి వీడ్కోలు తీసుకుందామని వెళ్లిన అల్లం నారాయణకు సిబ్బంది నిండైన హృదయంతో… బరువైన గుండెలతో…వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర తొలి మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తొమ్మిదిన్నరేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనునిత్యం జర్నలిస్టుల సంక్షేమమే పరమావధిగా పని చేసిన అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్ గా పదవీ విరమణ చేశారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెచ్చిన 42 కోట్ల సంక్షేమ నిధితో దాదాపు 18 కోట్ల రూపాయల నిధులను తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టారు. గత ఏడేళ్లుగా మరణించిన దాదాపు 500 మంది జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయలు ఇవ్వటమే కాకుండా,  నేటికీ నెలకు మూడు వేల చొప్పున పెన్షన్ ఇచ్చి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. కరోనా కష్టకాలంలో దాదాపు ఏడు కోట్ల రూపాయలను జర్నలిస్టులకు సత్వర సహాయం కింద విడుదల చేశారు. సాహిత్య పరంగా ఆరు పుస్తకాలను ప్రింట్ చేసి భావి జర్నలిస్టుల కోసం, వారి శిక్షణకు సహాయపడేలా అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో జర్నలిస్ట్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి దాదాపు పదివేల మంది జర్నలిస్టుల కు పైగా శిక్షణను ఇప్పించారు.

చివరగా దాదాపు 15 కోట్ల రూపాయల నిధులతో శాశ్వత మీడియా అకాడమీ భవనాన్ని తన హయాంలో భవిష్యత్ తరాల కోసం నిర్మించిన తీరు అభినందనీయం. కంప్యూటర్ శిక్షణ ద్వారా జర్నలిజం కోర్స్ పెట్టాలని ఒక ప్రత్యేక హాలు నిర్మించడంతో పాటు, ఆడిటోరియం నిర్మాణం చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. కాగా నిర్మించిన హాల్లో ఎంతో గొప్పగా శిక్షణ తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఆ నిర్మాణాన్ని చూస్తేనే తెలుస్తుంది తెలంగాణ జర్నలిస్టులకు ఎంతో చేయాలనే తపన, ఒక విజన్ అల్లం నారాయణకి మాత్రమే ఉందని… దానిని చూసిన ఎవరైనా ఒప్పుకోక తప్పదేమో.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News