Sunday, December 22, 2024

గన్స్‌తో యాక్షన్ చేయడం ఎంజాయ్ చేశా: ఫరియా అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మత్తు వదలరా సినిమాకు సీక్వెల్‌గా ’మత్తువదలారా 2’ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 13న సినిమా విడుదల కానుంది.

ఈ నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “మత్తువదలారా 2 సినిమా ఒక థ్రిల్లర్. కథ చాలా నచ్చింది. విన్న వెంటనే ఓకే చేసేశా. మత్తువదలారా పార్ట్ 1 బిగ్ హిట్. సెకండ్ పార్ట్… ఫస్ట్ పార్ట్‌కి డిఫరెంట్‌గా వుంటుంది. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ డెలివరీ బాయ్స్ నుంచి స్పెషల్‌గా ఏజెంట్‌గా కనిపిస్తారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు సన్నిధి. నేను కూడా ఒక స్పెషల్ ఏజెంట్. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ పై సాఫ్ట్ కార్నర్ వుంటుంది. ఇందులో నా క్యారెక్టర్‌కు యాక్షన్ వుంటుంది. గన్స్‌తో యాక్షన్ చేయడం చాలా ఎంజాయ్ చేశా.ఈ సినిమాలో లిరిక్స్ రాయడంతో పాటు సాంగ్ పాడాను. అలాగే నా టీంతో సాంగ్ కొరియోగ్రఫీ కూడా చేశాను. రితేష్ రానా చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. కాల భైరవ మ్యూజిక్ సర్‌ప్రైజింగ్‌గా వుంటుంది. నా సాంగ్‌ని ఆయన నెక్స్ లెవెల్‌కి తీసుకెళ్ళారు” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News