Thursday, December 19, 2024

ప్రియురాలు ఫోన్‌లో మాట్లాడుతుందని… హోటల్‌కు పిలిచి హత్య

- Advertisement -
- Advertisement -

 

ఛండీగఢ్: ప్రియురాలు ఫోన్‌లో మరొకరితో మాట్లాడుతుండడంతో ఆమెను ప్రియుడు హత్య చేసిన సంఘటన హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆకాశ్ అనే యువకుడు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఎకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఓ ప్రియురాలు ఉంది. గత ఏడేళ్ల నుంచి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆమె గత కొన్ని రోజుల మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఆకాశ్ అనుమానం పెంచుకున్నాడు. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 31 పోలీస్ స్టేషన్‌లో పరిధిలో లైమ్‌స్టోన్ హోటల్‌కు రమ్మని ప్రియురాలుకు ఆకాశ్ కబురు పంపాడు. ప్రియురాలు మరొక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. తన ప్రియురాలి మెడకు తాడు చుట్టి హత్య చేశాడు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆకాశ్ హత్య చేసినట్టుగా ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఎంబిబిఎస్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News