Thursday, January 23, 2025

యమపాశమైన విద్యుత్ తీగ

- Advertisement -
- Advertisement -

తెగిన విద్యుత్ తీగ యమపాశమైంది
రైతుతో సహ ఎద్దు మృతి
అల్లీపూర్‌లో విషాదం

Farmer and ox dead with Current shock

 

మన తెలంగాణ/రాయికల్‌: రెండు రోజలు క్రితం గాలివాన భీభత్సం సృష్టించడంతో విద్యుత్ వైరు తెగి క్రింద పడింది. పశుగ్రాసం కోసం వెళ్లిన ఎద్దు తెగిన తీగకు తగిలి విద్యుత్ షాక్‌తో మృతిచెందగా ఎద్దును రక్షించేందుకు వెళ్లిన అన్నదాతను తెగిన తీగ బలిగొన్న సంఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… అల్లీపూర్ గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మయ్య (65) అనే రైతు తన ఎడ్లను మేపడానికి గ్రామశివారులోకి వెళ్లాడు. అయితే రెండు రోజుల క్రితం గాలివానకు కరెంటు వైర్ తెగిపడింది. ఈ విషయాన్ని ఎవరు గమనించలేదు. పశుగ్రాసం కోసం వెళ్లిన ఎద్దు అట్టి తీగకు తగిలి చనిపోగా అక్కడికి వెళ్లిన రైతు లక్ష్మయ్య ఎద్దును కాపాడబోయి తాను విద్యుద్ఘాతానికి గురై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పేద కుటుంబానికి చెందిన లక్ష్మయ్య ఇంటికి పెద్ద దిక్కుకావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరౌతున్నారు. ఈ ప్రభుత్వం లక్ష్మయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి కోరారు. కాగ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కిరణ్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News