Thursday, January 23, 2025

జంగవానిగూడెంలో రైతు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

 

Farmer burnt alive in Jangavanigudem

మన తెలంగాణ/కొత్తగూడ: వృద్ధ రైతు సజీవ దహనమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని జంగవాణిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం…. జంగవానిగూడెంలో బుర్క సారయ్య(80) వృద్ధుడు కాలం సమీపిస్తున్న నేపథ్యంలో పంట పొలాన్ని శుభ్రం చేసుకోవడం కోసం తన మొక్కజొన్న చేను తుప్పకు నిప్పు పెట్టాడు. దీంతో తన వైపు ఈదురు గాలులు వీయడంతో వెంటనే మంటలు ఒక్కసారిగా సారయ్యకు చుట్టుకున్నాయి. దీంతో ఊపిరాడక కళ్లు తిరిగి పంట పొలంలోనే పడిపోయాడు. దీంతో ఆ మంటల్లోనే సారయ్య సజీవ దహనమయ్యాడు. వెంటనే సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడి చేరుకుని బోరున విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News