వెంట తెచ్చుకున్న తాడుతో చెట్టుకు ఉరివేసుకుంటుండగా కాపాడిన పోలీసులు
మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: భూ సమస్యలు పరిష్కారం కావడంలేదని ఓ వ్యక్తి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సోమవారం మద్యాహ్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కుప్పలుకుప్పలుగా భూ సమస్యలు పెండింగ్‌లో ఉనానయని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. – ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై బాధితుడి నుండి తాడును లాగేసుకున్నారు. భూమి సమస్య పరిష్కారం కోసం లక్ష రూపాయలు అధికారులు అడుగుతున్నారని, తన వద్ద డబ్బులు ఇచ్చే స్థోమత లేదని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాని బాధితుడు ఖలీల్ పాష ఆరోపించారు. ఇంత జరగినా కూడా ఎవరు అడిగే దిక్కు లేదు అని మిగతా భూ సమస్యల కోసం వచ్చిన బాధితులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ ఉరివేసుకోవడానికి ప్రయత్నించిన ఖలీల్‌ను సముదాయించి నీ పనులు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.