- Advertisement -
హైదరబాద్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లి గ్రామంలో మద్యానికి బానిసైన రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సింగాయిపల్లి గ్రామానికి చెందిన చందా బాలయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. బాలయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతు మద్యానికి బానిసయ్యాడు. గతంలో కొంత భూమి అమ్మినా అప్పులు తీరలేదు. శనివారం మద్యం తాగిన అనంతరం ఇంట్లోని పురుగు మందు తాగి పడిపోయాడు . గమనించిన కుటుంబ సభ్యులు బాలయ్యను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రెండో కుమారుడు బాల్‌రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -