Sunday, December 22, 2024

విద్యుత్ స్తంభం విరిగిపడి రైతు మృతి

- Advertisement -
- Advertisement -

విద్యుత్ స్తంభం విరిగిపడి ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కోడుపాకలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రైతు పిట్టల లింగం (27) పొలంలో ట్రాక్టరుతో దున్నకాలు చేస్తుండగా ఈ క్రమంలో ట్రాక్టర్ వెనుక ఉన్న గొర్రు పొలంలో ఉన్న విద్యుత్ స్తంభానికి తగలడంతో స్తంభం విరిగి ఒక్కసారిగా ట్రాక్టర్ నడుపుతున్న రైతు లింగం పై పడింది. ఈ ఘటనలో లింగం అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు లింగంకు 6 నెలల క్రితమే వివాహం జరిగింది. దీంతో రైతు కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News