Sunday, December 22, 2024

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

Farmer died due to electric shock

రేగొండః విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన సంఘటన రేగొండ మండలంలోని దుంపిల్లపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన రైతు బత్తిని కొమురయ్య(45) తేలికపాటి వర్షం పడడంతో గ్రామసమీపంలో తనకున్న వ్యవసాయ భూమిలో శుక్రవారం ఉదయం మిరప తోట పెట్టేందుకు కూలీలను పిలిచాడని, దానితో తోట పెట్టడానికి అవసరమైన అచ్చు మొద్దు ప్రక్కన గల రైతు భూమిలో ఉండగా తన భూమిలోని భుజంపై పెట్టుకొని తీసుకువస్తున్న తరుణంలో క్రిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే రైతు కొమురయ్య ప్రాణాలు విడిచారు. కూతవేటు దూరంలో ఉన్న బత్తిని శ్రీకాంత్, లోకుల రవిలు గమనించి గ్రామంలోని వ్యక్తులకు సమాచారం అందించగా విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ననిగంటి శ్రీకాంత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరకాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. కొమురయ్య మృతితో వారి కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News