Sunday, January 19, 2025

కరెంట్ షాక్‌కు గురై రైతు మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : కరెంట్ షాక్‌కు గురై రైతు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ ఎస్సై విజయ్ కుమార్ అందించిన వివరాల మేరకు పెద్దాపూర్ గ్రామానికి చెందిన భూపతి నిరంజన్(55) శుక్రవారం గ్రామానికి సమీపంలో గల వల్లభంపల్లి శివారులో ఉన్న తన సొంత పొలంలో పొలం పనులకై వెళ్లగా అప్పటికే బోరు మోటారు వైర్లు తెగిపడి ఉన్నాయని, వాటిని సరిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.

మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీస్ సిబ్బంది జానకి రాములు, శ్రీనివాసులు చేరుకుని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News