Friday, December 20, 2024

విద్యుదాఘాతంతో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : విద్యు దాఘాతంతో రైతు మృతి చెందిన సంఘ టన ఒకటి శుక్రవారం చౌటుప్పల్ పురపాలక పరిధిలోని లింగాకెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. మండలంలోని మందోళ్లగూడెం గ్రా మానికి చెందిన యాట ముత్యాలు(58) లింగా రెడ్డిగూడెంకు చెందిన కందాల సుబ్బారెడ్డి వ్యవసాయ భూమిలో పచ్చగడ్డి కోసుకు వచ్చేందుకు వెళ్లాడు.

గడ్డి కోసే పనిలో నిమగ్నమై వుండగా తన చేతిలోని కొడవలి గడ్డిలోంచి వున్న బోరు మోటార్ విద్యుత్ వైరుకు తగలడంతో కరెంటు షాకుతో ముత్యాలు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే అతడిని చికిత్స కోసం చౌ టుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మృతి చె ందినట్లు దృవీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు జరుపు తున్నట్లు పోలీస్ ఇన్ స్పెక్టర్ దేవేందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News